The Desk…Eluru : ఓస్లో సైన్స్ పార్క్ ను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ఓస్లో సైన్స్ పార్క్ ను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు/ఓస్లో- నార్వే : ది డెస్క్ :

నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాం లో భాగంగా నార్వేలో పర్యటిస్తున్న  ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఇతర భారత ఎంపీల బృందం బుధవారం ఉదయం ఓస్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నార్వేజియన్ డే కేర్ సెంటర్ ను సందర్శించారు.

డే కేర్ అనేది నార్వేలో పిల్లలకు హక్కుగా అమలు చేస్తున్న  విషయాన్ని, డే కేర్ వ్యవస్థ నడుస్తున్న తీరును అక్కడి సిబ్బంది ఎంపీలకు వివరించారు. ఆనంతరం ఓస్లో మేయర్ “అన్నే లిండ్‌బో”తో సమావేశమై పట్టణ పరిపాలన, పరిశుభ్రత, పన్నుల విధానంలో అనుసరిస్తున్న పద్ధతులను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

‎మధ్యాహ్నం సమయంలో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌, మీడియా సైన్స్‌, హెల్త్, క్లైమేట్, ఎనర్జీ, నానోటెక్నాలజీ వంటి రంగాలకు చెందిన 300కు పైగా కంపెనీలున్న ఓస్లో సైన్స్ పార్క్ ను ఎంపీల బృందం సందర్శించింది. ఆవిష్కరణలకు తోడ్పడటం, పరిశోధనలను వాణిజ్యీకరించడం, వృద్ధి చెందుతున్న కంపెనీలను మరింత ప్రోత్సహిస్తున్న విధానాలను అధికారులు, సంస్థల ప్రతినిధులు భారత ఎంపీలకు వివరించారు. 

అనంతరం భారత ఎంపీల బృందం బుధవారం సాయంత్రం నార్వేలోని మరో ప్రధాన నగరమైన ట్రోంసో కి పయనమయ్యారు. గురువారం ట్రోంసో నగరంలో జరిగే ఆర్కిటిక్ కౌన్సిల్ సమావేశం, పోలార్ ఇన్స్టిట్యూట్, సీ ఫుడ్ కౌన్సిల్ సందర్శన సహా పలు కార్యక్రమాల్లో భారత ఎంపీలు పాల్గొననున్నారు.