- శ్రీనివాస గౌడ్ నుండి స్టేట్మెంట్ కార్డు చేసిన ఏపీటీఎస్ అధికారులు
- అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారుల సస్పెండ్ షురూ
🔴 కృష్ణా జిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ :
జిల్లాలోని కృత్తివెన్ను మండలం ఇంతేరు రెవిన్యూ గ్రామంలో విలేజ్ నెంబర్(16) సర్వే నెంబర్ 94లో 3501 ఎకరాల మడ భూములు ఆక్రమణకు గురికావడానికి కారకులైన అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని యు ఎఫ్. ఆర్టిఐ రాష్ట్ర కో కన్వీనర్ జంపాన శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జంపాన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
ఇంతేరు మడభూములను కొందరు బడాబాబులు గత ప్రభుత్వ హాయంలో మంత్రి జోగి రమేష్ ప్రోత్సాహంతో ఆక్రమించి చెరువులను త్రవ్వారని దీనిపై లోకాయుక్త జస్టిస్ లక్ష్మారెడ్డి, ఉపలోకయుక్త జస్టిస్పి రజిని, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి కే విజయానంద్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఫారెస్ట్ భూములను బడా బాబులకు కట్టబెట్టడంలో స్థానిక మాజీశాసనసభ్యులు, మాజీ మంత్రి జోగి రమేష్ కు కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టాయని అధికారులు సైతం మంత్రి ఒత్తిడికి లొంగిపోయారని పేర్కొన్నారు.

చిన్నచిన్న రైతులు మడ అడవులను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయా భూములను పెద్ద పెద్ద రైతులకు కట్టబెట్టి సన్నకారు రైతులకు ఎకరాకు సుమారు ఎనిమిది వేలు లీజు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖ అధికారులు ఆయా చెరువులకు ట్రాన్స్ఫార్మర్లు నిర్మాణం చేసి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారని వివరించారు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడానికి గ్రామ వి ఆర్ ఓ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారని తెలిపారు.
ఆయా అంశాలను రికార్డు పరంగా గతంలో ఏపీ టీఎస్ సిఐ దిరిశాల వెంకన్న చౌదరి ఎస్సై పి ముక్కంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు గురువారం రెండోసారి ఏపీ టీఎస్ ఎస్సై స్థాయి అధికారి ఆర్ దాస్ స్టేట్మెంట్ నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు
అటవీ పర్యావరణ భూములను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అనుమతులు మంజూరు చేశారు అన్నారు ఆయా శాఖల అధికారులపై జీవో ఎమ్మెస్ నెంబర్ 458 ప్రకారం శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశానికి నియోజకవర్గ ఆర్టీఐ కో కన్వీనర్ , సాంబశివరావు, తోట్లవల్లూరు ఉయ్యూరు మండలాల కోకన్వీనర్లు సాకే రాములమ్మ, బొల్లా శివపార్వతి పాల్గొన్నారు.

