The Desk…Eluru : ఏలూరు ఎంపీ కార్యాలయంలో వందేమాతరం వేడుకలు

The Desk…Eluru : ఏలూరు ఎంపీ కార్యాలయంలో వందేమాతరం వేడుకలు

  • వందేమాతరం గీతంకు 150 ఏళ్లు పూర్తి.

వందేమాతరం స్ఫూర్తితో సమాజం కోసం యువత పోరాడాలి ➖ఎంపీ పుట్టా మహేష్.‎

🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బెంగాల్ లో పుట్టి దేశమంతా వ్యాపించి, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహోజ్వల దేశ భక్తి గీతం ‘వందేమాతరం’ కి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కార్యాలయానికి వచ్చిన పాఠశాల విద్యార్ధులు వందేమాతరం గీతాలాపన చేశారు.

నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పంపిన సందేశాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది చదివి వినిపించారు. బానిస సంకెళ్లను తెంచుకుని స్వాతంత్యం కోసం పోరాటం చేయటంలో, కోట్లాది మంది భారతీయులను ఉత్తేజపరిచిన వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం సహా దేశ ప్రజలందరికీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

వందేమాతరం స్పూర్తిగా సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని, పెరిగిపోతున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారులను పారద్రోలటంలో తమవంతు పాత్ర పోషించాలని ఎంపీ పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏడాది పాటు జరిగే వందేమాతరం వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.