The Desk…Eluru : నార్వే పార్లమెంట్ సందర్శన మంచి అనుభవం➖MP మహేష్ పుట్టా

The Desk…Eluru : నార్వే పార్లమెంట్ సందర్శన మంచి అనుభవం➖MP మహేష్ పుట్టా

🔴‎ ఏలూరు : ఓస్లో /నార్వే : ది డెస్క్ :

నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా భారత ఎంపీల బృందం మంగళవారం నార్వే పార్లమెంట్ ను సందర్శించారు. దేశ పార్లమెంట్ లో వివిధ సభా సంఘాలతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన  సమావేశాల్లో పాల్గొన్న పుట్టా మహేష్ కుమార్ బృందం, పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు.

నార్వే పార్లమెంట్ సందర్శన మంచి అనుభవంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. నార్వేయన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ (NORAD) ఆధ్వర్యంలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ఎంపీల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిజిటలైజేషన్ ద్వారా భారతదేశంలో అమలు చేస్తున్న సేవలను వివరించారు.

‎భారత ఎంపీల బృందం ఓస్లో లోని “నో ఐసోలేషన్” సంస్థను సందర్శించారు. ఇక్కడ వివిధ సమస్యలతో పాఠశాలకు రాలేని, గైర్హాజరైన విద్యార్థులను టెలిప్రెసెన్స్ రోబోట్ ద్వారా తరగతి గదితో అనుసంధానం చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా అక్కడి A1 రోబోట్ ను ఆసక్తిగా తిలకించిన ఏలూరు ఎంపీ అది పనిచేస్తున్న తీరును సంస్థ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.