The Desk…Eluru : కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి.

The Desk…Eluru : కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి.

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘోర విషాద ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న భారత ఎంపీల బృందం నార్వే పర్యటన కోసం ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కాశీబుగ్గ విషాద ఘటన తెలిసి, అక్కడి నుంచే ఒక ప్రకటన విడుదల చేశారు.

మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవలే ప్రారంభించబడిన ఈ  ప్రైవేట్ దేవాలయంకు ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, భక్తుల ఒత్తిడికి రైలింగ్ పడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం వెల్లడిస్తోందన్నారు.

కాశీబుగ్గ ఆలయ విషాద ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర  హోం మంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేశారని, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సత్వర సహాయ చర్యలు చేపట్టారన్నారు. ఇటువంటి సమయంలో కూడా సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరమని, అందరూ సంయమనం పాటించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.