- రైతులెవరు అధైర్య పడవద్దు.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గాలివానల కారణంగా మండవల్లి మండలం లో అల్లినగరం పెరికేగూడెం గ్రామాలలో పడిపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

రైతులు ఎవరు అధైర్య పడవద్దనీ , పడిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే విధంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్సీ వెంకటరమణ కృషి చేస్తామన్నారు.

కూటమి ప్రభుత్వం రైతులకు అన్నివేళలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

