The Desk…Eluru : CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ పుట్టా

The Desk…Eluru : CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ పుట్టా

  • ‎ఎంపీ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్
  • ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలపై అధికారులతో మాట్లాడిన ఎంపీ.‎
  • 50 లక్షలకు పైగా విలువైన CMRF చెక్కులు పంపిణీ.‎

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎంపీ ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించారు. సమస్యలను సావధానంగా విన్న ఎంపీ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఆనంతరం వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న 68 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50,15,862 విలువైన CMRF చెక్కులను అందించిన ఎంపీ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ధిక సమస్యలతో వైద్యం కోసం ఇబ్బందిపడుతున్న వారికి CMRF ద్వారా సహాయం అందించడానికి  ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకపక్క వర్షం పడుతున్నప్పటికీ, గ్రీవెన్స్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలతో ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది.



‎‎కలెక్టర్ కార్యాలయంలో..తుఫాను ముప్పు, సహాయ చర్యలపై సమీక్షా సమావేశం.

వచ్చే రెండు రోజులు తుఫాన్ తీవ్రత, అప్రమత్తంగా ఉండండి.
➖ఎంపీ పుట్టా


రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఏలూరు కలెక్టరేట్ లో తుఫాన్ పరిస్థితిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.

ఆనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ..తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయని, మంగళవారం తుఫాన్ మరింత తీవ్ర ప్రభావం చూపించనుందని ఐఎండీ హెచ్చరికలు ఇచ్చినందున ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కొల్లేరు, ఉప్పుటేరు తీర గ్రామాలపై మరింత దృష్టి పెట్టాలని, శుద్ధి చేసిన తాగునీరు, పాలు, పాల పొడి, అత్యవసర మైన మందులు, ఆహార సరఫరా అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీ సూచించారు.

ఆర్ అండ్ బీ, జలవనరులు, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారని, వాతావరణ శాఖ, RTGS నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. తుపాను ప్రభావంతో వచ్చే రెండు రోజులు తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్స్, స్తంభాల కింద నిలబడకూడదని ప్రజలను కోరారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

అత్యవసరం అయితే ఏలూరు కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 1800-233-1077, 94910 41419 ఫోన్ నెంబర్ల లేదా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ నంబర్స్ +91 96181 94377, +91 98855 19299 కు ఎవరైనా కాల్ చేయవచ్చని ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

తుఫాన్ పరిస్థితులపై మండల పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ :

‎మొంథా తుఫాన్ పరిస్థితులపై మండల పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉండి, అవసరమైన చోట సహాయ చర్యలలో పాల్గొనాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సహాయం అవసరమైనా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు, లేదా ఎంపీ కార్యాలయానికి కాల్ చేయవలసిందిగా సూచించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని, వారంతా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి, సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారన్నారు.