The Desk…Eluru : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 28 కేసులు నమోదు

The Desk…Eluru : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 28 కేసులు నమోదు

🔴ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యములో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులు.. ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై విస్తృతం స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో శనివారం రాత్రి కలపర్రు టోల్గేట్ వద్ద, జంగారెడ్డిగూడెం పట్టణములో ఆర్టీవోలు ఎస్.బి.శేఖర్ మరియు ఎస్.ఎస్.రంగనాయకులు పర్యవేక్షణలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారుల ప్రత్యేక బృందాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ శనివారం తెలియచేశారు.

ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై 28 కేసులు నమోదు చేసి 1.91 లక్షల రూపాయలను జరిమానా విధించామన్నారు, సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ లిస్టు లేని మరియు తదితర ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు ప్రతి రోజూ కొనసాగుతాయని డీటీసీ కరీమ్ తెలిపారు.