The Desk…Nuzividu : ఎన్టీఆర్ బాటలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం.. ఎంపీ

The Desk…Nuzividu : ఎన్టీఆర్ బాటలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం.. ఎంపీ

🔴 ఏలూరు జిల్లా : నూజివీడు మండలం : మర్రి బంధం : ది డెస్క్ :‎

తెలుగుదేశం పార్టీ రికార్డు ప్రపంచంలోనే మరే పార్టీకి లేదు.‎ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది.‎ సూపర్ సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి.‎‎సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న  కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ‎శుక్రవారం సాయంత్రం నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం గొప్పదని, ఆ ముహూర్త బలంతో 43 ఏళ్ళుగా ప్రతీ తెలుగువాడు గర్వంగా కాలర్ ఎగరేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ తిరుగులేనివిధంగా దూసుకువెళుతోందన్నారు. ఆయన ఆశీర్వాద బలంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తనలాంటి ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి, ఆయన ఆశయాల సాధనకోసం నిరంతరం పనిచేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కష్టపడుతున్నారని, అనేక కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి క్షణం కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ దీపావళి పండుగ రోజు కూడా దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటిస్తూ కష్టపడుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నారు.

అభివృద్ధితో పాటు, సంక్షేమంలో కూడా వెనుకడుగు వేయకుండా, సూపర్ సిక్స్ సహా అన్ని హామీలు అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. వైసీపీ నేతల మాయ మాటలు నమ్మినందుకు ఒకసారి రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, కాబట్టి మరోసారి అటువంటి మోసపు పార్టీ నాయకుల మాటలు ఎవ్వరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి, టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.‎‎