కపాస్ కిసాన్ యాప్ ను పత్తి రైతులు వినియోగించుకోవాలి : ఏఎంసీ చైర్మన్ కొప్పుల వేణు రెడ్డి
తెలంగాణ : సూర్యాపేట్ : ది డెస్క్ :
పత్తి కొనుగోలు లో అక్రమ ల కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్క పత్తి రైతు కపాస్ కిసాన్ యాప్ ను వినియోగించుకోవాలనీ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలేoల గ్రామంలోనీ మజీoత్ కాటన్ మిల్లు లో సి. సీ. ఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి మాట్లాడుతూ..
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, గత ప్రభుత్వం పత్తి రైతులను పట్టించుకోకపోవడంతో రైతులు గోసపడ్డారన్నారు. రైతుల కోసం ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
కపాస్ కిసాన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్క పత్తి రైతు ఇక పత్తిని అమ్ముకోవడం చాలా సులభమని పేర్కొన్నారు. ప్రతి పత్తి రైతు ఈ కపాస్ కిసాన్
యాప్ లో ఏ తేదీన, ఏ సమయాన ఏ మిల్లులో అమ్ముకోవాలో స్లాట్ బుక్ చేసుకోనే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్క రైతు తమ సమయానికి అనుకూలంగా పత్తిని తాలు లేకుండా, గింజ లేకుండా, రంగు మారిన పత్తిని ఎండపెట్టుకొని కపాస్ కిసాన్ యాప్ లో సూచించిన మిల్లులో అమ్ముకోవాలని సూచించారు. పత్తి తేమ శాతం 8%.నుండి 12% ఉంటే మద్దతు ధర పొందచ్చుఅన్నారు. నవంబర్ నెల లో ప్రారంభించాల్సిన సి సీ ఐ కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోసం 20 రోజుల ముందుగానే ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామాలలో ఎవరైనా పత్తి కోసం తక్కిడి తూకాలు వేసి రైతులను మోసం చేస్తే ఎంతటి వారి నేనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతుల కోసం గ్రామాలలో ఏఈఓ ల వద్ద క్లస్టర్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో, మిల్లులలో
కపాస్ కిసాన్ యాప్
కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్న పత్తి రైతుల వద్ద ఎవరైనా లంచం అడిగితే 7330733970 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఐకెపి కేంద్రాలలో కానీ సిసిఐ కేంద్రాలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో కి వెళ్లి తూనికల కొలతల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని తనిఖీలు చేపడతామన్నారు. రైతుల కోసం నిరంతరం కృషి చేస్తూ వారి ప్రయోజనాలను కాపాడుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ అధికారి నాగేశ్వర్ శర్మ, సిసీఐ అధికారి గిరీష్, వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండి ఫసియోద్దీన్ (ముక్రమ్), అసిస్టెంట్ సెక్రటరీ వెంకటరెడ్డి, యూడిసి కాసిం, బలేంల గ్రామ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మిల్లు యాజమాన్యాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

