The Desk…Pedatadepalli : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

The Desk…Pedatadepalli : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

🔴 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : పెదతాడేపల్లి : ది డెస్క్ :

పెదతాడేపల్లి గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమములో భాగంగా.. క్లీన్ ఎయిర్ ..వాయు కాలుష్యం నివారణ పై ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు…కాలుష్యం వలన వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తెలియజేస్తూ. పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్యవంతమైన పరిపాలన అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో ఉన్నాయన్నారు.పర్యావరణాన్ని కాపాడి, ప్రజలకు స్వచ్ఛమైన గాలి కావాలంటే మొక్కలు నాటాలని… పొల్యూషన్ లేకుండా ఉండాలంటే డీజిల్ వాహనాలను వినియోగించకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చారు.

వీటిని వినియోగించడం వలన పొల్యూషన్ తగ్గి స్వచ్ఛమైన గాలి అందరికీ అంతటా వ్యాపిస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీటి వినియోగం వల్ల ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.. కాబట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీరు , స్వచ్ఛమైన గాలి ప్రతి ఒక్కరు వినియోగించుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.

వాయు కాలుష్యం నివారణ పై ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు…కాలుష్యం వలన వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తెలియజేస్తూ. *పీల్చే గాలి స్వచ్ఛంగా* ఉండాలని..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని..ఈ రోజు ” క్లీన్ ఎయిర్” స్వచ్ఛ గాలి థీమ్ తో కార్యక్రమాన్ని పటవల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మొక్కలు నాటితే సరిపోదని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని… ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగానికి, నడకకు ప్రాధాన్యతను ఇవ్వాలని దీనివలన పర్యావరణ పరిరక్షణకు, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అన్నారు.

వాతావరణ కాలుష్యం ప్రజలు ఆరోగ్యంపై ఏటువంటి దుష్ప్రభావం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న పనులకు సైకిల్ వినియోగం, ప్రతిరోజు నడక, యోగా, వ్యాయామం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజలకు వివరించారు.

వ్యర్థ పదార్థాలను కాల్చడం ద్వారా వాతావరణం కలుషితం అవుతుందన్న విషయాలను ప్రజలకు అవగాహన కల్పించారు. సోలార్ యూనిట్లు వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని.. కట్టెలు పొయ్యి స్థానంలో ఎల్పిజి ఉపయోగించాలని, దీపావళి రోజున వాతావరణం కలుషితం చేయని క్రాకర్స్ ను మాత్రమే వాడాలని సూచించారు.

స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి పెదతాడేపల్లి గ్రామాన్ని ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర , సర్పంచ్ , ఎండిఓ , గ్రామస్తులు, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.