The Desk…Vijayawada : 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ➖మంత్రి మనోహర్

The Desk…Vijayawada : 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ➖మంత్రి మనోహర్

  • 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం
  • రైతు కే మొదటి స్థానం
  • మార్పు కోసం కలిసి పని చేద్దాం

🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం హోటల్ తాజ్ లో జరిగింది.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున తన తండ్రి చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పించాలని, గౌరవం కోసం రైస్ మిల్లులు ఏర్పాటుచేసి, పనిచేస్తున్న రైస్ మిల్లర్ల లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అందర్నీ కలుపుకొని పనిచేస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం చేసిన 1674 కోట్ల రూపాయల బకాయిలను తీర్చడంలోనూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిల్లర్లకు చెల్లించవలసిన 763 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది అన్నారు. గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు.

ఈ ఏడాది 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 51లక్షలు మైట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ గ్యారంటీలు 1:2 ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకుగాను 35 బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. కొన్ని జిల్లాలలో రైస్ మిల్లుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రియల్ టైం గవర్నెన్స్ చేసి చూపిస్తామన్నారు.

సంస్కరణలలో భాగంగావాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్: “హాయ్” అని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభం…రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు గుర్తు చేశారు.పేపర్ లెస్ ఆర్గనైజేషన్ మొదలగు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. మార్పు కోసం కలిసి పని చేద్దాం అని మంత్రి పిలుపునిచ్చారు.

“పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వం తోడుగా నిలవాలి. రైతు కోసం కలిసి పనిచేద్దాం, వ్యవస్థను గౌరవిద్దాం” అన్నారు. గత సంవత్సరం అనుభవంతో, తేమ శాతం కొలిచే యంత్రాలు, రవాణా సదుపాయాలు, క్వాలిటీ గన్నీ బ్యాగులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమస్య పరిష్కారానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, పని చేసే విధానం పారదర్శకంగా ఉండాలన్నారు.గత సంవత్సరం ధాన్యం కొనుగోలు అనుభవంతో అవసరమైనన్ని క్వాలిటీ కలిగిన గన్ని బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

క్షేత్రస్థాయిలో ఎక్కడ సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా తేమ శాతం నిర్ధారించే మిషన్ల విషయంలో మరియు ట్రాన్స్పోర్ట్ విషయములు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 PPC ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్టు మంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ ప్రతినిధులకు ముందుగానే మంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు..

పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ IAS మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ వివరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ VC & MD ఢిల్లీ రావు IAS మాట్లాడుతూ… ఈరోజు జాయిన్ అయిన నేను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు. 2024-2025 సంవత్సరం ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిందన్నారు.సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ R. గోవిందరావు, FCi- GM విజయ్ కుమార్ యాదవ్ ప్రసంగించారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూరి ప్రకాష్ రావు, కోశాధికారి రంగయ్య నాయుడు, మరియు 26 జిల్లాల రైస్ మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.