ఏలూరు జిల్లా : కైకలూరు/కలిదిండి : ది డెస్క్ :
రాష్ట్ర అభివృద్ధి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతి యువకులు సేవా స్ఫూర్తి పెంపొందేలా సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని, అమరావతికి జీవం పోద్దాం..రూ.116 లు సాయం చేద్దాం, చేయి చేయి కలుపుదాం.. అమరావతిని నిర్మిద్దాం.. అనే అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు కలిదిండి సుగుణ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులతో కలిసి కాలేజీ ప్రిన్సిపల్ అధ్యక్షతన మండల తాసిల్దార్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లంక రత్నారావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రాజధానికి నిర్మాణానికి నేను సైతం అంటూ ఒక్కొక్కరు క్యూఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ ఖాతాకు రూ.116 రూపాయలు విరాళం అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులను, ఉపాధ్యాయులను డాక్టర్ మనోజ్ సాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వైష్ణవి పిలుపుతో అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుందని చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న తపన అభినందనీయమని తాసిల్దార్ కొనియాడారు.
రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రత్నారావు మాట్లాడుతూ… వైష్ణవి తండ్రి మనోజ్ సహకారంతో అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తూ రాజధానికి నిధులు సమీకరణలోను కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గతంలో అభివృద్ధి పనులు నిర్వహించడమే కాకుండా సేవ దృక్పథంతో కరోనా కష్టకాలంలో అనాధ శవాలకు దహన సంస్కారాలు చేసిన ఘనత వైష్ణవికే దక్కిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తనవంతు పోరాటం చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి వైష్ణవి అన్నారు.