The Desk…Gollapudi : కాకినాడ జిల్లాను “MSN కాకినాడ జిల్లా” గా నామకరణం చేయాలి                        ➖చైర్మన్ చిలకలపూడి పాపారావు

The Desk…Gollapudi : కాకినాడ జిల్లాను “MSN కాకినాడ జిల్లా” గా నామకరణం చేయాలి ➖చైర్మన్ చిలకలపూడి పాపారావు

🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ/గొల్లపూడి : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం గొల్లపూడి బీసీ భవనంలో కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యాంశంగా కాకినాడ జిల్లాకు “MSN కాకినాడ” అని నామకరణం చేయాలని అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

MSN అంటే మహాదాత, విద్యాప్రదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని పేర్కొన్నారు. ఆయన ఒక సాధారణ కార్మికుడిగా ప్రారంభించి స్వశక్తితో ఉన్నతస్థాయికి ఎదిగి, తన సంపాదన అంతా MSN చారిటీస్‌ ద్వారా పేద విద్యార్థుల విద్య, వసతి, భోజనం, వేదపాఠశాలల నిర్వహణకు వినియోగించిన సేవలను గుర్తుచేశారు.

ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ నామకరణం ఉండాలని చైర్మన్ చిలకలపూడి పాపారావు అన్నారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తూ, పలు ముఖ్య అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించారు.

▪️ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పల్లవ వంశ కొపనాతి కృష్ణమ్మ వర్మ వారసులను దేవాలయ ట్రస్ట్ చైర్మన్‌గా నియమించాలని విజ్ఞప్తి. దేవాలయ ఆస్తి రికార్డుల పునరుద్ధరణ, వారసత్వ హక్కుల పునరుద్ధరించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అభ్యర్థన.

▪️ కేంద్ర పథకాల కింద సబ్సిడీ శాతం 40 నుంచి 75 శాతానికి పెంచాలని విజ్ఞప్తి.

▪️ ప్రతి నియోజకవర్గంలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అభ్యర్థన.

▪️ యువతకు ఆర్థిక మరియు వృత్తిపరంగా బలపడేందుకు ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సిఫార్సు.పై అంశాలన్నింటిపై చైర్మన్ చిలకలపూడి పాపారావు ప్రత్యేక వినతి పత్రం సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు సమర్పించనున్నట్లు తెలిపారు.

సమావేశంలో కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి హాజరయ్యారు.