- ఏడాదికి 25,000/- ఆదా – ప్రతి కుటుంబానికి..
🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :

సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా… భీమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద జిఎస్టి తగ్గింపు ద్వారా కొన్ని రకాల వస్తువులపై ప్రతి కుటుంబానికి నెలకు చాలా ఆదా అవుతుందని.. జిఎస్టి తగ్గింపు ద్వారా వచ్చే ఫలాలను సమాజంలోని ప్రతి కుటుంబం అందిపుచ్చుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు.
జిఎస్టి తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి సగటున సంవత్సరానికి దాదాపు 25 వేల రూపాయల వరకు తగ్గుతుందని.. మనం నిత్యం ఉపయోగించే వస్తువులపై టీవీ ,ఫ్రిడ్జ్, లాప్టాప్, ఏసి, మెడిసిన్స్, స్టేషనరీ ఇలా అన్ని రకాల వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలకు ఎంతో నగదు ఆదా అవుతుందని.. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండాలన్నారు.
అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని తెలియజేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో MRO దేవకీదేవి, MPDO పద్మావతి , హౌసింగ్ ఏఈ, భీమడోలు గ్రామ సర్పంచ్ పాము సునీత, పంచాయతీ కార్యదర్శి తనూజ, తెదేపా మండల ప్రెసిడెంట్ కరణం పెద్దిరాజు, యుగంధర్, వార్డ్ మెంబెర్స్ , MPTC లు మరియు ZPTC , AMC చైర్మన్ , నీటి సంఘం ప్రెసిడెంట్ , NDA కూటమి నాయకులు, పంచాయితీ పాలకవర్గం సభ్యులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

