The Desk…Eluru : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) – మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలకు విస్తరణ : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

The Desk…Eluru : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) – మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలకు విస్తరణ : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా, ప్రజల దృష్టికి మరింత చేరువ చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను సోమవారం 13.10.2025 మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో అక్టోబర్, 13వ తేదీ సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి యధావిధిగా పిజి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో అమలవుతున్న ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం ఇప్పుడు వికేంద్రీకరించింది.

దీని ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో, లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చు.అలాగే, ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రభుత్వం అందించిన అధికారిక వెబ్‌సైట్:🔗 https://meekosam.ap.gov.inఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే,📞 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

ఈ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి, సమయానుకూలంగా పరిష్కారమవుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు గుర్తించి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు.