ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని సిబ్బందికి ఎస్పి సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీ.ఐ కృష్ణకుమార్, ఎస్.ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
