🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :
ప్రాధాన్యతాక్రమంలో దశలవారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల క్రతువుని నిరాటంక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
తనను కలవడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించి, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కూడా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.