ద డెస్క్ న్యూస్ : ఏలూరు జిల్లా , నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో 5 సం.ముల మైనర్ బాలికపై ది. 04.08.2024 వ తేది నాడు ఒక వ్యక్తి యింటి లో సుమారు రాత్రి 09.30 గంటల సమయంలో తన కుటుంబ సబ్యులతో కలిసి తన ఇంటి వరండా లో నిద్రించుచుండగా నిందితుని పసి పాపపై అత్యాచారం మరియు దొంగతనం చేసిన కేసులో సమాచారాన్ని రాత్రి 02.30 నిమిషాలకు అందుకున్న వెంటనే 2.45 నిమిషాలకు పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకుని,
ఈ కేసులో మైనర్ బాలిక అవ్వడం వలన నిందితుని యొక్క సమాచారం ఏమీ తెలియకపోయినా, ఏ విధమైన క్లూస్ లేనటువంటి కేసును ఛాలెంజ్ గా తీసుకొని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంటనే జిల్లా ఎస్పీ అనుభవజ్ఞులైనటువంటి అధికారులతో నాలుగు టీము లను ఏర్పాటు చేసినారు.
అధికారులు నిందితుని వివరాలను సేకరించడం కొరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి మనం భీమడోలు సిఐ గారి ఆధ్వర్యంలో ఒకటిను నిడమర్ సిఐ ఆధ్వర్యంలో ఒకటిను మరియు నూజివీడు సిఐ ఆధ్వర్యంలో మరొక టీంను నియమించి జిల్లా వ్యాప్తంగా నిందితుని కొరకు జల్లెడ పట్టినారు.
నిందితుని గుర్తించి 3.00 గ.లకు గుంటూరు జిల్లా అధికారులకు పల్నాడు జిల్లా అధికారులకు మరియు ఏలూరు జిల్లాలలో అధికారులు నిందితుని గురించి ఏలార్ట్ చేసినారు.
నిందితుని యొక్క వివరాలను సేకరించిన కొరకు డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమును సంఘటన స్థలానికి విని వెంటనే చేసి నిందితుని యొక్క ఆధారాలను సేకరించడం కొరకు అధికారులు దర్యాప్తు కొనసాగించినారు.
గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ల ఎస్పీల యొక్క సహాయ సహకారాలతో నిందితుని యొక్క వివరాలను అధికారులు తెలుసుకొని నిందితుని మిరియాల జయ రావు, తండ్రి పేరు పెద్ద రామయ్య, 33 సం.లు, కుమ్మరి కోట గ్రామము, రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా అని సమాచారం.
నాలుగు బృందాల లోని అధికారులు వెంటనే నిందితుని యొక్క వివరాలను గురించి త్వరితగతిన సమాచారాన్ని సేకరించి నిందితుని అరెస్టు చేసిన ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం
నిందితుని అయిన మిరియాల జయ రావు, తండ్రి పేరు పెద్ద రామయ్య, 33 సం.లు, కుమ్మరి కోట గ్రామము, రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా. అతను గతములో రెంటచింతల గ్రామంలో ఇటువంటి నేరానికి పాల్పడినట్లు, ఎంత త్వరగా అరెస్టు చేసామో, అంతా త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అంత త్వరగా కోర్టు త్వరగా శిక్ష పడేల చూస్తామని,
జిల్లాలో గతములో ఇటు వంటి నేరాలకు పాల్పడిన నిందితుల యొక్క వివరాలను సేకరించినట్లు వారిపై కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్షలు పడేలగా పర్యవేక్షిస్తామని, సదరు వ్యక్తులపై రౌడీ షీట్ల లను ఓపెన్ చేయిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు తెలియ చేసినారు.
ఏలూరు జిల్లాలో మహిళలు మరియు చిన్న పిల్లలపై అఘాయిత్యం చేసే కేసులలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు
ఈ కేసులోని నిందితుని అరెస్టు ది 06.08.2024 వ తేదీన హనుమాన్ జంక్షన్ లో నిందితుని అరెస్టు చేసి, దొంగిలించిన సెల్ ఫోన్ స్వాదీనపరచు కున్నరు
ఈ కేసును వెంటనే నిందితుని అరెస్ట్ చేసిన డిఎస్పీ E.శ్రీనివాసులు గారిని, నూజివీడు రూరల్ సర్కిల్ CI K. రామ కృష్ణ గారిని, నిడమర్రు సిఐ సుభాష్ గారు భీమడోలు సిఐ ,బి రవి కుమార్ గారు,ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూజివీడు రూరల్ PS. SI R.మల్లికార్జునరెడ్డి గారిని మరియు వారి సిబ్బంది ని, ఏలూరు జిల్లా ఎస్పీ K. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు అభినందించినారు.
www.thedesknews.net