- ఏపీ రాజధాని నిర్మాణానికి విరాళాలిచ్చి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్..
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పిలుపునకు ఉపాధ్యాయ వర్గాలు స్పందించాయి. రూ. 116/- విరాళం ఇవ్వండి అమరావతిని కాపాడండి అని వైష్ణవి చేస్తున్న ప్రచారానికి ముందుకు వచ్చిన ముదినేపల్లి మండలంలోని ఉపాధ్యాయులు శనివారం తమ వంతు విరాళాలను ఏపీసీఆర్డిఎ బ్యాంకు ఖాతాకు క్యూ ఆర్ కోడ్ ద్వారా పంపించారు.

వైష్ణవి నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో ఎంఈవో -1 డి. రామారావుతో పాటు సుమారు 60 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు పాల్గొని రూ.20 వేల విరాళాలను సీఆర్డీఏ ఖాతాకు పంపారు. వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు బలుసు రఘురామయ్య, కృష్ణారావు, కోడూరు అర్జునరావు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కూనపరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.