The Desk…Eluru : ప్రజలకు గాంధీ జయంతి, దసరా శుభాకాంక్షలు ➖MP మహేష్ పుట్టా

The Desk…Eluru : ప్రజలకు గాంధీ జయంతి, దసరా శుభాకాంక్షలు ➖MP మహేష్ పుట్టా

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అన్నారు.

రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలుచేసిందని, అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై ధరల భారం తగ్గించి ఈ దసరా పండుగను మరింత సంతోషంతో జరుపుకునేట్లు చేసిందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

‎ఈ విజయదశమి సందర్భంగా దుర్గమ్మ అమ్మవారి చల్లని చూపులు అందరిపై ఉండాలని, చేసే పనులన్నీ అమ్మవారి ఆశీస్సులతో విజయవంతం కావాలి కోరుకుంటున్నానని చెబుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ‎‎ఈ సంవత్సరం దసరా పండుగ రోజే గాంధీ జయంతి కూడా రావడం సంతోషంగా ఉందన్నారు. 

దేశాన్ని పట్టి పీడించిన తెల్ల దొరలను తరిమికొట్టి భారతీయులకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన ఆ మహాత్ముడికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.‎‎