The Desk…Eluru : అంబుల వైష్ణవి ఔదార్యం..!! దహన సంస్కారానికి ఆర్థిక సాయం అందించిన వైష్ణవి, డాక్టర్ మనోజ్

The Desk…Eluru : అంబుల వైష్ణవి ఔదార్యం..!! దహన సంస్కారానికి ఆర్థిక సాయం అందించిన వైష్ణవి, డాక్టర్ మనోజ్

ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : పెయ్యేరు : ది డెస్క్ :

మండలంలోని పెయ్యేరుగ్రామనికి చెందిన మేరుగుముళ్ళ పున్నయ్య(75) గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ రోజు ఉదయం 7గం. లకు మృతిచెందాడు. మృతుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్య, పిల్లలు లేరు.

సదరు వ్యక్తి కుటుంబీకులు ఆర్థిక ఇబ్బందుల నేపద్యంలో విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ కుమార్ తో మాట్లాడి.. వెంటనే మృతుడు పున్నయ్య దహన సంస్కారాల నిమిత్తం ₹ 5,000 రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేసి, వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.