ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం :THE DESK NEWS : ఉభయగోదావరి జిల్లాల్లో పెరుగుతోన్న గల్ఫ్ దేశాల బాధితులు.పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుంటోన్న తెలుగోళ్ళు.తాజాగా బయటపడ్డ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ ఆక్రందన.ఏడాది క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లిన సంకురమ్మ.గత కొన్ని నెలలుగా ఆమెకు జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తోన్న యజమాని.తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా రహస్యంగా కుటుంబ సభ్యులకు పంపిన సంకురమ్మ.ఇంట్లో పది మంది ఉంటే తన ఒక్కదానిపైనే పని భారం అంతా మోపుతున్నారని సంకురమ్మ ఆవేదన.తాను ఇంటికి వెళ్లిపోతానని యజమానికి చెబితే గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని, ఏజెంట్ కు చెబితే పట్టించుకోలేదని చెబుతోన్న సంకురమ్మ.కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, తనకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోవట్లేదని వాపోయిన సంకురమ్మ.తాను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతానని, తనను కాపాడాలని వీడియోలో కోరిన సంకురమ్మ
