The Desk…Eluru : మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు – నిరసన కార్యక్రమం

The Desk…Eluru : మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు – నిరసన కార్యక్రమం

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సందర్భంగా 18 డివిజన్ కార్పొరేటర్, ఏలూరు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్ బాబు మాట్లాడుతూ.. దళిత విద్యార్థులు అభివృద్ధి చెందడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదా..?టిడిపి ప్రభుత్వం గతంలోనే చెప్పింది దళితులుగా పుట్టడం ఎవరైనా కోరుకుంటారా అని.. అంటే దళితులుగా పుట్టిన వారు డాక్టర్లు అవ్వకూడదా..?పిపిపి విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తే 60 ఎస్సీ కులాలలో చదువుకునే వారు ఎవరు ఉంటారు..? కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ నాయకులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.. పి పి పి విధానాన్ని రద్దు చేయాలి.

దళితులు చదువుకుని మేలు పొందాలి. ప్రజలకు విద్య, వైద్యం అనేది ప్రధానమైనది.. దానినే ప్రైవేటీకరణ చేస్తే ఎవరు చదువుకుంటారు..? డబ్బు ఉన్నవారికే చదువులా..? డబ్బు ఉన్న వారికే వైద్యమా..? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత..ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు త్వరలోనే ఉన్నాయని.. రాను రాను పెట్రేగిపోతున్నారని.. కూటమి ప్రభుత్వం దిగే వరకు ఎస్సీ కమ్యూనిటీ ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని ఉన్నారని.. ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని.. అలాగే జగన్మోహన్ రెడ్డి17 కాలేజీలు శంకుస్థాపన చేస్తే.. దానిని మీరు డిజిటల్ రూపంలో ఎక్కడా లేదని చూపిస్తున్నారు.

కానీ ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.. మీరు కళ్ళు తెరిచి చూడండి ఆ ప్రదేశాలకు వెళ్లి చూడండి. నిజమే ఏమిటో తెలుస్తుంది.. చంద్రబాబు గ్రాఫిక్స్ మాంత్రికుడు, ప్రపంచాన్ని నేనే నిర్మించానని చెబుతూ ఉంటారు. వాస్తవాలు తెలుసుకోండి.ప్రజల నుండి, దళితుల తరపున తెలియజేస్తున్నాం..పిపిపి విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక అని హెచ్చరించారు.

కార్యక్రమంలో.. నూకపెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, తేరా ఆనంద్, మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జయకర్, టింపుల్, రత్నకుమారి, లీల, ఏడు నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.