The Desk…Vunguturu : ఉంగుటూరు నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సుడిగాలి పర్యటన

The Desk…Vunguturu : ఉంగుటూరు నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సుడిగాలి పర్యటన

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :‎

హామీ ఇచ్చిన మేరకు ఏడాది లోపే రోడ్లు నిర్మించామని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఆదివారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పలు రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా గుండుగొలను బీసీ కాలనీలో రూ: 70 లక్షలతో బీసీ కాలనీ 1వ రోడ్డు నుండి 16వ రోడ్డు నిర్మించే సీసీ రోడ్డుకు, రూ: 45 లక్షలతో నిర్మించే బిటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీ, 

అనంతరం కైకరంలో రూ.95.5 లక్షలతో నిర్మించే డ్రెయిన్లు, సీసీ రోడ్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్న నిండ్రకొలనులో రూ: కోటి రూపాయలతో నిర్మించిన BT, CC రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్న నిండ్రకొలనులో స్థానిక ప్రజలతో ఎంపీ కాసేపు ముచ్చటించారు. గత ప్రభుత్వంలో రోడ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల కొరత ఉన్నా, రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అంతకు ముందు ఉంగుటూరు వెళుతూ పి.కన్నాపురం రైల్వే గేట్ వద్ద ఆగిన ఎంపీకి గ్రామస్థులు స్వాగతం పలికారు.

కన్నాపురంతో పాటు పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. రైల్వే అధికారులను పంపి సర్వే చేయించి ఆర్వోబీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఉదయం ఉంగుటూరు బయలుదేరిన ఎంపీ ముందుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తో కలిసి ఏలూరు పట్టణంలోని RR పేటలో “ఆరా క్లినిక్” హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.‎