- అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనిస్తే పోలీస్ స్టేషన్లో తెలపాలని పోలీసుల విజ్ఞప్తి
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

జిల్లా ఎస్పీ కే. ప్రశాంత్ శివ కిషోర్ ఆదేశాలపై పోలీసులు డాగ్ స్క్వాడ్ తో విస్తృత భద్రతా తనిఖీలను నిర్వహించారు.
జిల్లా ఏ.ఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కైకలూరు టౌన్ SI వెంకట్ కుమార్ లు కైకలూరు టౌన్ పరిధిలో విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు.

కైకలూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, శ్యామలంబ అమ్మ వారి ఆలయం, పరిసర దేవాలయాలు, లాడ్జిలు, సినిమా థియేటర్ ప్రాంతంలో నిర్వహించినారు.

➡️ రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించారు.
➡️ ఈ చర్యల ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలను ముందస్తుగానే అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
👉 అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులను గమనించిన వెంటనే డయల్ 112 కు లేదా దగ్గర లో ఉన్న పోలీసు స్టేషన్ లలో సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు ప్రజలుకు విజ్ఞప్తి చేశారు.