🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
స్థానిక ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చేయి చేయి కలుపుదాం.. అమరావతి నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీవో యద్దనపూడి. రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. చిన్నతనంలోనే రాష్ట్రానికి, రాజధానికి తన వంతుగా సాయం అందించడమే కాకుండా అందరిని భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
తమ వంతు సాయం అందిద్దామన్నా అందుకు ఎలా చేయాలో తెలియక వెనకడుగు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సులభంగా నేరుగా సి ఆర్ డి ఏ ఖాతాకే మన విరాళాన్ని అందించవచ్చు అన్నారు. మన వంతుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీ వద్ద “క్యూ ఆర్ కోడ్” ను ఏర్పాటు చేసి ప్రజల అందరూ తప్పక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ ఎండిఓ బి అశోక్ మాట్లాడుతూ.. కేవలం చిన్న సాయం ద్వారా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. చిన్నవారి నుంచి పెద్దవారు వరకు భాగస్వాములు కావాలని కోరారు.
ఎప్పటి నుంచో రాజధాని కోసం తాను ఏదో ఒకటి చేయాలన్నా గాని ఎలా చేయాలో తెలియలేదని.. అందుకే ఈ కార్యక్రమం ద్వారా రూ.116 పది రెట్లు పెంచి తనవంతు సాయం అందిస్తున్న అన్నారు. అనంతరం ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలను వైద్యులు అంబుల మనోజ్ శాలువాలతో సత్కరించారు.
తన కుమార్తె ఇచ్చిన చిన్న పిలుపుమేరకు చేయి చేయి కలుపుదాం.. అమరావతి నిర్మిద్దాం అనే నినాదానికి స్వచ్ఛందంగా ఇంత మంది ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. మన భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించి ముందుకు రావాలని కోరారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎంవి రమణ రావు, జూనియర్ అసిస్టెంట్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, స్కానర్ ద్వారా విరాళం నగదును సిఆర్డిఏ ఖాతాకు 116/- రూపాయలు పంపించారు.