ద డెస్క్ న్యూస్: తెలంగాణ వరంగల్ జిల్లా: నెక్కొండ మండలం చంద్రుగొండలో కొమరమ్మ (73) కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు వరంగల్ లో ఉండగా, చిన్న కొడుకు తల్లితో చంద్రుగొండలోనే ఉంటున్నాడు. ఇటీవల కొమురమ్మఅనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రిలో చేర్పించిన చిన్నకొడుకు చికిత్స పూర్తి అవ్వకముందే ఇంటికి తీసుకొచ్చి శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లో ఉంచి తల్లికి తిండి పెట్టకుండా, బాగోగులు పట్టించుకోకుండా వదిలేసాడు. దీంతో ఆ తల్లి శరీరానికి చీమలు పట్టాయి.
