🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు పట్టణంలోని వైఎమ్ హెచ్ఏ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన కెవి సత్యనారాయణ ప్రతిభా పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు పాల్గొన్నారు.

హిందూ యువజన సంఘం, కెవిఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ప్రముఖ మేలట్టూరు భాగవత మేళ కళాకారులు ఎస్ నాగరాజన్ , ఎస్ అరవింద్ సుబ్రమణ్యంలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా కెవి సత్యనారాయణ ప్రతిభా పురస్కారం అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కళలకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోతున్న ఈరోజుల్లో కెవి సత్యనారాయణ పేరుతో ట్రస్టు నెలకొల్పి, కళాకారులను గౌరవించే కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, బీజేపీ నేత తపనా చౌదరి, జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.