ద డెస్క్ న్యూస్: తెలంగాణ ,పెద్దపల్లి జిల్లా
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్
పెద్దపల్లి జిల్లా: శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయంలో భూమి మ్యుటేషన్ కోసం కాడం తిరుపతి అనే వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీరాంపూర్ తహశీల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఎ దాసరి మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్. ఫోన్ పే ద్వారా తహశీల్దార్ కు రూ.15 వేలు చెల్లించిన తిరుపతిని అదనంగా మరో రూ.10 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన తిరుపతి.
