THE DESK NEWS : శునకాలతో – శునకానందం..‼️

THE DESK NEWS : శునకాలతో – శునకానందం..‼️

ఏలూరు జిల్లా: ఏలూరు :THE DESK NEWS :

స్ట్రీట్ డాగ్స్ తో నగర వాసులు బెంబేలు…!

శస్త్ర చికిత్సలు చేయకుండా కాలయాపన…!!

అధికారుల నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలి…??

సగటున రోజుకు 20 మంది కుక్కకాటుకు గురి..

కానరాని కుక్కల కు.ని కార్యక్రమం…‼️

ఏలూరు నగరంలో స్థానిక అంబికా సెంటర్ కెనాల్ రోడ్డు రాయల్ కన్వెన్షన్ హాల్ వద్ద విద్యార్థులు వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా ఓ బాలుడిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. ‘వెంటనే ఆ బాలుడు బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు యువకులు కర్రలతోను, రాళ్లతో ఆ కుక్కులను చెదరగొట్టారు. చిన్న గాయం కావటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. నగరంలోని పిచికగుంట నుంచి వెంకన్న చెరువు చిరంజీవి బస్టాండ్, 18వ డివిజన్లో జర్నలిస్టు కాలనీ, వైయస్సార్ కాలనీ వెళ్లే రోడ్డులో నిత్యం పదుల సంఖ్యలో వీధి కుక్కలు సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో బైక్పై అటుగా వెళ్లే వాహనదారులపై విరుచుకుపడుతుండటంతో భయందోళనకు గురవుతున్నారు. దీంతో కుక్కల సమస్యతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.*వీధి కుక్కల స్వైర విహారంతో బెంబేలు…*ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన పాలకవర్గం, అధికారులు మాత్రం ప్రజా సమస్యలు, ఫిర్యాదులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుబాటులో వనరుల ఉన్నా కిందస్థాయి అధికారలను, సిబ్బందిని సమన్వయం చేసుకుని వీధి శునకాల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. దీంతో వాహనాల వెంట, రాత్రుళ్లు ఒంటిరిగా వచ్చే వారి వెంట, చిన్నారులపై పడుతున్నాయి. దీనితో ప్రమాదాలు జరిగి పలువురు గాయాలపాలలైన సంఘటనలు ఉన్నాయి. వీధి కుక్కలు కరిచిన వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ విధంగా జిల్లా కేంద్రమైన ఏలూరు సర్వజన ఆసుపత్రికి ప్రతీ రోజూ దాదాపుగా 20 మందికిపైగా కుక్కకాటు గురైన వారు చికిత్సకు వస్తున్నారంటే ఈ పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.*అలంకార ప్రాయంగా శస్త్ర చికిత్స కేంద్రం.*అయిదేళ్ల క్రితం పశుసంవర్థకశాఖ జేడీ కార్యాలయం ఆవరణలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో ఇందులో తొలి విడతగా నగరంలో 700 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు గతంలో కొన్ని వీధి కుక్కలకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించారు. ఇలా ఒక్కో కుక్కకు రూ.1,300 వరకు ఖర్చు చేసేవారు. ఆ తర్వాత నుంచి ఈ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఇది ప్రారంభించిన దగ్గర నుంచి అన్నీ సమస్యలే. ఇక్కడ శాశ్వత వైద్యుడ్ని నియమించాలి. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తాత్కాలికంగా నియమించినప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో ఎవ్వరూ దీనిని పట్టించుకోకపోవటంతో ఇక్కడ శస్త్ర చికిత్సల కార్యక్రమం అమలు నోచుకోలేదు. అప్పటి నుంచి ఈ కేంద్రం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది.*జంతు ప్రేమికులను సాకుగా చూపుతూ..*ఫిర్యాదులు ఉన్నా లేకున్నా క్షేత్ర స్థాయిలో ప్రజారోగ్య పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, వార్డు సచివాలయాల పర్యావరణ కార్యదర్శుల సహకారంతో శునకాలతో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీధికుక్కలను పట్టుకుని కు.ని శస్త్ర చికిత్స కేంద్రాలకు తరలించి శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంది. అయితే వీధి కుక్కలను పట్టుకునే క్రమంలో సిబ్బంది వాటిని హింసిస్తూన్నారని, శస్త్ర చికిత్సలు ప్రమాణాల మేరకు జరగడం లేదని పలువురు జంతు ప్రేమికుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. శస్త్ర చికిత్స చేశాక వాటిని సంరక్షణ శాఖలో మూడు నాలగు రోజులపాటు ఉంచి ఆహారం ఇచ్చి అవి కోలుకున్నాక తిరిగి ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదలాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రమాణాలు పాటించకుండా ప్రజారోగ్య అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. శస్త్ర చికిత్సలు ప్రారంభించడం ఆగిపోవడం ఇలా రెండు, మూడు సార్లు జరిగింది. అదేమని అడిగితే జంతు ప్రేమికులే అడ్డు తగులుతున్నారని సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు ఉన్నాయి..