The Desk…Devarapalli : అక్రమ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసిన ఎ.పి.సి.పి.డి.సి.ఎల్. తోట్లవల్లూరు సెక్షన్ ఎ.ఇ. బి. దేవదాసుపై ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి  కె.విజయానంద్ విచారణకు ఆదేశం

The Desk…Devarapalli : అక్రమ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసిన ఎ.పి.సి.పి.డి.సి.ఎల్. తోట్లవల్లూరు సెక్షన్ ఎ.ఇ. బి. దేవదాసుపై ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ విచారణకు ఆదేశం

🔴 కృష్ణాజిల్లా : తోట్లవల్లూరు మండలం : దేవరపల్లి : ది డెస్క్ :

దేవరపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సర్వీసు నెం.6711306000471 ను మంజూరు చేసినందుకు, కేటగిరి-1లో గల 67113060000275 నుండి డైరీఫారమ్కు అనధికారికంగా విద్యుత్ వినియోగానికి అనుమతించినందుకు తోట్లవల్లూరు సెక్షన్ ఎ.పి.సి.పి.డి.సి.ఎల్. అసిస్టెంట్ ఇంజనీరు బొందలపాటి దేవదాస్ పై జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ ఎ.పి.ట్రాన్స్కో విజిలెన్స్ వారిని విచారణ చేయవలసినదిగా ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్.. ది. 13-08-2025న చేసిన ఫిర్యాదు మేరకు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి పై ఉత్తర్వులను జారీచేశారు.

G.O.Ms.No.28 Social Welfare కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, దేవరపల్లి గ్రామంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన దళిత మహిళ కె.ఉమామహేశ్వరమ్మ గారి ఇంటికి “జగజ్జీవన్ జ్యోతి పథకం” ద్వారా (SCP) Dept, Dt.29-04-2022 5 2 3.6711306000471 2 2 దేవరపల్లి గ్రామానికి చెందిన రెడ్డిబత్తుల శ్రీనివాసరెడ్డి, తండ్రి నాగిరెడ్డి అనధికారికంగా సర్వీసును సెక్షన్ అధికారుల సహకారంతో వినియోగించుకున్న విషయమై ఎ.పి.టి.ఎస్., విజయవాడ సర్కిల్ ఇనస్పెక్టర్ విచారణ జరిపి ఫెనాల్టీ విధించనందున, కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, దేవరపల్లి గ్రామంలోని కేటగిరి- 1తో గల 67113060000275 నుండి గత 15 సంవత్సరాలుగా రహదారి అవతల ఉన్న డైరీఫారమ్ కు అనధికారికంగా వినియోగించిన విద్యుత్ సర్వీస్ ను ది.10-04-2025న తొలగించినప్పటికీ తోట్లవల్లూరు సెక్షన్ అధికారులు ఫెనాల్టీ విధించనందున, అవినీతికి పాల్పడి విద్యుత్ సర్వీసును మంజూరు చేసిన తోట్లవల్లూరు సెక్షన్ ఎ.పి.సి.పి.డి.సి.ఎల్. అసిస్టెంట్ ఇంజనీరు బొందలపాటి దేవదాస్ పై ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయటం జరిగింది.