The Desk…Tenali : తెనాలిలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన మంత్రి మనోహర్

The Desk…Tenali : తెనాలిలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన మంత్రి మనోహర్

🔴 గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ :

దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు అందిస్తాం*జిల్లాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంను మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రారంభించారు.

సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంబించడం సంతోషదాయకం అన్నారు. దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధాన మంత్రి అన్నారు.

“మహిళ ఆరోగ్యం – జాతీయ ఆరోగ్యం” అని ఆలోచించి ” స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ప్రారంభించారన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ – శక్తి వంతమైన, ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో 40 మంది వృద్ధులు దివ్యాంగులకు వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ బర్డ్స్ అందజేశారు.

అదేవిధంగా తెనాలి రూరల్, కొల్లిపరలో దివ్యాంగులకు త్వరలో మరిన్ని వీల్ చైర్లను అందజేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్యులు మరియు అధికారులతో కలిసి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, ప్రదర్శన శాలలను సందర్శించారు.