ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : పేరూరు : ది డెస్క్ :
మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన వీర్ల ఝాన్సీ (55) కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తెల్లవారు జామున మృతిచెందింది. మృతురాలికీ పిల్లలు లేరు. భర్త 15 ఏళ్ల క్రితం చనిపోయి ఒంటరిగా సోదరుడు సాయంతో జీవిస్తోంది.
విషయాన్ని తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తక్షణమే స్పందించి, తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయన్ని వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం అందించారు. సదరు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని డాక్టర్ మనోజ్ హామీ ఇచ్చారు.