The Desk…Eluru : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పొగాకు రైతుల సన్మానం

The Desk…Eluru : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పొగాకు రైతుల సన్మానం

🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :‎‎

‎అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు సాధించిన ఎంపీకి రైతుల అభినందనల వెల్లువెత్తాయి. శనివారం ఉదయం ఏలూరు శాంతి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంకు వందలాదిగా తరలివచ్చిన పొగాకు, పామాయిల్ రైతులు ఎంపీని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

సందర్భంగా రైతులనుద్దేశించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు.

రైతుల ఇబ్బందులపై పలుమార్లు తాను పార్లమెంట్ లో మాట్లాడటంతోపాటు, కేంద్ర వాణిజ్య, వ్యవసాయ మంత్రులను కలిసి సమస్యలను వివరించిన మీదట, స్వల్ప పెనాల్టీతో.. కేంద్రం అనుమతించిన దాని కంటే రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. ‎ఆయిల్ పామ్ కు కూడా సరైన ధర లభించేట్లు ఒత్తిడి తేగలిగామని, తాజాగా పామాయిల్ గెలలకు మంచి ధర లభిస్తోందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పొగాకు, పామాయిల్ రైతు సంఘాల ప్రతినిధులు..  తమ సమస్యలను చెప్పగానే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రుణపడి ఉంటామన్నారు. ఇటువంటి ఎంపీ దొరకడం ఏలూరు పార్లమెంట్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

‎గ్రీవెన్స్ : భారీగా తరలివచ్చిన ప్రజలు‎శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. రైతులు, ప్రజలు భారీగా  తరలి రావడంతోఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. నియోజకవర్గాల్లో సమస్యలపై పలువురు వినతి పత్రాలు ఇచ్చారు.

వినతులు పరిశీలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసారు.‎‎డిసెంబర్ నాటికి జంగారెడ్డి గూడెం రహదారి పనులు..‎జంగారెడ్డిగూడెం ఏలూరు రహదారి పనులు నిలిచిపోవడంపై కాంట్రాక్టరుని, ఆర్ &బీ అధికారులను పిలిచి మాట్లాడారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ డిసెంబర్ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.‎‎

ఏలూరు జిల్లా మీదుగా నూతన జాతీయ రహదారి.. ‎ఖమ్మం – కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల – ఏలూరు – కైకలూరు – కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.‎