ఏలూరు జిల్లా, కలిదిండి, THE DESK NEWS : గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను కలిదిండి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని మంగళవారం సీ.ఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీ.ఐ మాట్లాడుతూ… గంజాయి మత్తుకి అలవాటు పడిన నలుగురు వ్యక్తులు గంజాయిని సేవించడమే కాకుండా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు కలిదిండి ఎస్.ఐ ఎస్. ప్రియ కుమార్ తన సిబ్బందితో కలిసి వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మీడియా ముఖంగా సీ.ఐ ప్రజలను కోరారు.
www. thedesknews.net