🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : భీమడోలు : ది డెస్క్ :
ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో పుప్పాల సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన 31వ గురుపూజోత్సవ వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజానికి వెన్నెముక లాంటివారు. వారు కేవలం పాఠాలు చెప్పే వారు కాదు, మంచి మనిషిగా మారడానికి మార్గం చూపించే దీపం వంటి వారు గురువులన్నారు. తనకు విద్య నేర్పిన గురువుల వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానన్నారు.
టీహానీ తాను చిన్నపాటి నుంచీ తల్లిదండ్రుల కంటే గురువుల వద్దే ఎక్కువ సమయం గడిపానని, జీవితంలో మనం సాధించేది గురువులు వేసిన బలమైన పునాది వల్లే అన్నారు. అటువంటి గురువులకు సన్మానం చేసే అవకాశం కలగడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కార్యాక్రమంలో పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కూటమికి చెందిన పార్టీల నాయకులు పాల్గొన్నారు.