జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరపల్లి ప్రసాద్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
రాష్ట్ర స్థాయిలో అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఈనెల 26వ తేదీ నుండి 29 వరకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 2500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు మన ఏలూరులో జరగడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. ఛాంపియన్‌షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్నివర్గాల ప్రజలు పూర్తిగా సహకరించాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.