ఆదిలాబాద్ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపిన యాజమాని

ఆదిలాబాద్ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపిన యాజమాని

తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లా

(ద డెస్క్ న్యూస్)

ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గోక రంగారెడ్డి గత పదహారేళ్లుగా లియో అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అనారోగ్యంతో లియో గత రాత్రి మరణించడంతో యాజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈరోజు శునకానికి పాడే కట్టి డప్పులతో యాత్ర చేసి తమ వ్యవసాయ క్షేత్రంలో లియోను పూడ్చి పెట్టారు. త్వరలోనే దానికి సమాధి కూడా నిర్మిస్తామని యాజమాని రంగారెడ్డి తెలిపారు.