THE DESK NEWS : ద్వారకాతిరుమల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం… కలెక్టర్ కన్నెర్ర..

THE DESK NEWS : ద్వారకాతిరుమల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం… కలెక్టర్ కన్నెర్ర..

ఏలూరు జిల్లా, ద్వారక తిరుమల మండలం : THE DESK NEWS : ద్వారకా తిరుమల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం విషయంలో వివరాలు

కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలు

నిధులు దుర్వినియోగం వివరాలు

పంచాయతీ కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావు : Rs.1,30,85,013/-ప్రత్యేక అధికారి అప్పటి ఎంపీడీఓ ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ఎంపీడీఓ యస్ ఆశీర్వాదం : Rs.18,73,538/-సర్పంచ్ కె స్వర్ణలత Rs.53,57,376/-టోటల్ నిధులు దుర్వినియోగం 2,03,15,927/-తీసుకున్న చర్యలు1. పంచాయతీ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావుని విధులకు నుంచి తప్పించమని కమీషనర్ పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, తాడేపల్లి వారికీ కాండక్ట్ రూల్స్ ప్రకారం సిఫారీస్ 2. ఎంపీడీఓ మరియు ప్రత్యేక అధికారి యస్ ఆశీర్వాదంపై క్రమశిక్షణ చర్య తీసుకోమని కమీషనర్ పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, తాడేపల్లి వారికీ కాండక్ట్ రూల్స్ ప్రకారం సిఫారీస్3. దుర్వినియోగం అయిన రూ. 5357376/- నిధులు మీ నుంచి ఎందుకు రికవరీ చెయ్యకూడదో సంజాయిషీ అడుగుతు సర్పంచ్ కె స్వర్ణలతకి పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 265 ప్రకారం తాఖీదు జారీ 4. రూల్ 42, GO. MS. NO 30, 20.01.1995 ప్రకారం సర్పంచు చెక్ పవర్ ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ అడుగుతూ తాఖీదు జారీ 5. 1994 పంచాయతీ రాజ్ చట్టం, సెక్షన్ 249-B(5l ప్రకారం సర్పంచ్ పదవి నుంచి 6 నెలలు పదవి కాలం ఎందుకు రద్దు చేయకూడదు అని సంజాయిషీ కోరుతూ తాఖీదు జారీ చేయడం జరిగింది.ప్రజల ఆకాంక్ష మేరకు, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ పాలన జరగాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిబంధనలు మేరకు ఖర్చు చేయవల్సిన నిధులు దుర్వినియోగం చేస్తే తప్పకుండ విచారణ చేసి చర్య తీసుకుంటామని, అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దుర్వినియోగం అయిన నిధులు తిరిగి రాబట్టి గ్రామ పంచాయతీకి జమా చేయించే చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.