The Desk…Machilipatnam : గణేశుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి : జిల్లా ఎస్పీ

The Desk…Machilipatnam : గణేశుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి : జిల్లా ఎస్పీ

  • విఘ్నేశ్వరునికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు

కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లా పోలీస్ : ది డెస్క్ :

వినాయక చవితి సందర్భంగా పరాసుపేట, పోలీసు వాటర్ ప్లాంట్ వద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

▪️ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞేశ్వరుడిని ప్రార్ధిస్తూ.. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లాలలో ప్రజలు సుఖ సంతోషాలతో.. అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరితో ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.

▪️ ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం గణేశుడికి లడ్డూను అందించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అక్కడికి విచ్చేసిన సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదాలు అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

▪️ఈ కార్యక్రమంలో AR అడిషనల్ SP బి. సత్యనారాయణ, బందరు డీఎస్పీ సిహెచ్ రాజా, AR DSP K. వెంకటేశ్వరరావు, CI లు, RI లు RSI లు సిబ్బంది పాల్గొన్నారు.