కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
నీటి తీరువా బకాయిలను చెల్లిస్తేనే పొలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను గురువారం ఆదేశించారు. ఎన్నో సంవత్సరాల నుండి నీటి తీరువా బకాయిలు చెల్లించకపోవడంతో రూ.26.93 కోట్లు బకాయి పేరుకుపోయింది.
జిల్లాకు చెందిన రైతులు తమ పొలాలను అమ్మినా, కొనుగోలు చేసినా నీటి తీరువా బకాయిలు లేకుండా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లాలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు