🔴 ఏలూరు జిల్లా : లింగపాలెం మండలం : అన్నపనేనివారి గూడెం : ది డెస్క్ :

అన్నపనేని వారి గూడెంలో బొల్లినేని సత్యనారాయణ, శైలజ దంపతులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 11 అడుగుల విగ్రహాన్ని తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి విరాళాలు సేకరించకుండా, తన గ్రామంలో స్థాపించడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎంతో గర్వంగా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బొల్లినేని సత్యనారాయణ మాట్లాడుతూ… 1982 వరకు వివిధ రాష్ట్రాల్లో తెలుగు వాడికి గుర్తింపు లేదని, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుండి ఎన్నో సేవలు తెలుగువారికి అందించారు. కిలో రెండు రూపాయలకే బియ్యo పథకం ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్ కే సాధ్యమని, మద్రాస్ గా పిలువబడే ఆంధ్రులను తెలుగువాడిగా గుర్తించడానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు చేసిన కృషి ఫలితంగా మనకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పీతల సుజాత, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ, మరియు లింగపాలెం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.