🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం మండలం : నాచుగుంట : ది డెస్క్ :

స్వాతంత్ర దినోత్సవాన నాచుగుంట పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసిన పంచాయతీ అధికారులు..ఈ కార్యక్రమంలో కీలకమైన కార్యాచరణ అంశాలు గురించి పంచాయతీ సిబ్బంది చర్చించడం జరిగింది.

కీలక అంశాలు :
1) గ్రామంలో పునరుత్పాదక ఇంధన పథకాల స్వీకరణను ప్రోత్సహించాలని..2) ప్రతి ఇంటికి ఆహ్వానం అందించి, సమాజాల సమీకరణ కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని..3) MNRE పథకాలపై అవగాహన పీఎం సూర్యాఘర్, పీఎం కుసుమ్, పిఎం జన్మన్, బయోగ్యాస్ వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయడం..4) పంచాయతీ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, రూప్ టాప్ సోలార్ మరియు సోలార్ పంప్ పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియపరచడం…
5) సౌర వ్యవస్థల కోసం 6% వడ్డీ రుణాలు పొందేందుకు బ్యాంకులతో సమన్వయం ఏర్పాటు చేయడం6) రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల కోసం డిమాండ్ అగ్రిగేషన్కు మరియు పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలి యోజన గురించి గ్రామస్తులకు తెలియ చెప్పడం..7) సోలరైజేషన్ కోసం కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు గుర్తించి ఏర్పాటు చేయడం 8) పంచాయతీ అభివృద్ధి పథంలో నడిపేందుకు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు..
9) డిస్కమ్/NREDCAP కొరకు అర్హత కలిగిన గృహాలను గుర్తించడం.10) సౌర ప్రాజెక్టుల కోసం భూమి సముపార్జన/ లీజును అందుబాటులో ఉండే విధంగా..11) బయో గ్యాస్ గుర్తించి, ప్రోత్సహించాలని..ఈ నిర్ణయ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం , అమలు చేయడం జరగాలని తెలిపారు. కార్యక్రమంలో నాచుగుంట సర్పంచ్ ఏలేటి సురేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి NVS ప్రసాద్, సచివాలయ సిబ్బంది మరియు స్థానికులు హాజరైనారు.