The Desk…Bhimadole : స్వచ్ఛ భీమడోలు

The Desk…Bhimadole : స్వచ్ఛ భీమడోలు

🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : ది డెస్క్ :

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భీమడోలు గ్రామపంచాయతీ శానిటేషన్ పై దృష్టిసారించింది. గ్రామపంచాయతీ పరిధిలో పలుచోట్ల నీరు నిల్వ ఉండకుండా యుద్దప్రాతిపదికన డ్రైనేజీస్ మరియు ఆక్రమణలు పంచాయతీ సిబ్బంది తొలగించారు. గ్రామ ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా పంచాయతీ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఆదేశాలతో హరితరాయబారులు డ్రైనేజీలు, వీధులను శుభ్రపరచడం మురుగు కాలువల లో చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి అడ్డంకులను తొలగిస్తూ.. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు. వీధుల వెంబడి మురుగు కాలువల వద్ద బ్లీచింగ్ చల్లించి అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.