The Desk…Eluru : ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..

The Desk…Eluru : ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..

  • హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని దేశభక్తి చాటాలి..
  • 100 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రతిఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం స్ధానిక ఇండోర్ స్టేడియం నుండి సెట్ వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు.

ఇండోర్ స్టేడియం నుండి ప్రారంభమై ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి,డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిఎస్పీ పి. శ్రావణ్ కుమార్, జిల్లా పర్యాటక సంస్ధ మేనేజరు పట్టాభి, సెట్ వెల్ సిఇఓ కె. ప్రభాకరరావు, డిఎస్ డివో శ్రీనివాసరావు, ఇతర పలువురు అధికారులు, పలు విద్యా సంస్ధల విద్యార్ధినీ విద్యార్ధులు ఉత్సాహకంగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లాకలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ

దేశభక్తిని మరింత పెంపొందించే దిశగా జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండా ఔనత్యాన్ని, దేశభక్తిని, జాతీయ సమైఖ్యతను చాటాలన్నారు.

పలు ప్రాంతాల్లో జాతీయ జెండాతో దిగిన సెల్పీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో సెల్ఫీతీసుకొని సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభిస్తుందన్నారు.

ప్రతి పౌరుడిలో దేశంపట్ల ప్రేమా, గౌవరం, దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇదే సమయంలో మనదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి ఎంతోమంది త్యాగధనులైన అమరువీరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారన్నారు. వారందరిని ఈ సందర్బంగా స్మరించుకుంటూ నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు.