The Desk…Kaikaluru (Crime) : కైకలూరు రూరల్ పోలీసుల అదుపులో ముగ్గురు గంజాయి విక్రేతలు – 2.5కిలోల గంజాయి స్వాధీనం – రిమాండ్కు తరలింపు

The Desk…Kaikaluru (Crime) : కైకలూరు రూరల్ పోలీసుల అదుపులో ముగ్గురు గంజాయి విక్రేతలు – 2.5కిలోల గంజాయి స్వాధీనం – రిమాండ్కు తరలింపు

ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ (క్రైమ్) : ది డెస్క్ :

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ పోలీసులు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డి.ఎస్.పి పర్యవేక్షణలో రూరల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి అందిన సమాచారం మేరకు కైకలూరు మండలం ఆలపాడు గ్రామం వద్ద శుక్రవారం మధ్యవర్తుల సమక్షంలో వాహన తనిఖీ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు పోలీసులు వివరించారు. పట్టుబడిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎ-1 గురివెళ్లి బాలసాయి రామిరెడ్డి 27 కైకలూరు మండలం భుజబలపట్నం శివారు, సింగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను వైజాగ్లో హెూటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చదువుచున్న సమయంలో గంజాయి త్రాగటానికి అలవాటుపడి.. గంజాయిని విక్రయిస్తూ గతంలో అనకాపల్లి జిల్లా వాతవరం పోలీస్లకు 2022 సం.లో పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇతను ఎటువంటి ఉద్యోగం చేయకుండా, చెడు వ్యసనాలకు అలవాటుపడి తన స్నేహితులతో కలిసి మరలా గంజాయి విక్రయిస్తూ వచ్చాడు.

ఎ-2 ముద్దాయి జయమంగళ లక్ష్మీనారాయణ (26) ఇదే మండలానికి సంబంధించిన చటకాయ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను డిగ్రీ వరకు చదువుకొని ప్రస్తుతం కూలి పనులు చేసుకొంటూ గంజాయి త్రాగటానికి అలవాటుపడి తన స్నేహితులతో కలసి గంజాయి విక్రయిస్తున్నాడు. ఎ-3 నరహరిశెట్టి వెంకట అవినాష్ 27 కైకలూరు వెలమపేటకు సంబంధించిన వ్యక్తి ఇతను చెన్నైలో బిటెక్ చదువుతూ గంజాయి త్రాగటానికి అలవాటుపడి, చదువు మధ్యలో ఆపేసినాడు. ప్రస్తుతం లారీ ట్రావెల్స్ మధ్యవర్తిగా పని చేస్తూ తన స్నేహితులతో కలసి గంజాయి విక్షయిస్తున్నాడు.

అలపాడు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు మోటార్ సైకిల్ పై వస్తూ ఎస్సైకి పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుండి మొత్తం 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. వారిని రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.