🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తుచేసే మధుర బంధమే రక్షాబంధనమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.

ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తోబుట్టువుల అనురాగాన్ని చాటుకునే రక్షాబంధన్ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్కాచెల్లెమ్మలకు ఎమ్మెల్యే బడేటి చంటి శుభాకాంక్షలు తెలిపారు.

రక్షా బంధన్ సందర్భంగా శనివారం ఉదయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. కేక్ లు కట్ చేయించి, స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… రాబోయే కాలంలో కూడా మహిళలందరికీ అన్నగా – తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. తాను ప్రజాప్రతినిధి అయినప్పటికీ మహిళలకు మాత్రం అన్నగా అండగా ఉండి, వారికి అన్ని మేళ్ళు జరిగేలా తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు, కార్యదర్శి మరియు వివిధ హోదాలో ఉన్న మహిళా నాయకురాలు పాల్గొన్నారు.