The Desk…Machilipatnam : గిరిజనులంతా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి కొల్లు రవీంద్ర

The Desk…Machilipatnam : గిరిజనులంతా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రాష్ట్ర భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ డి గంగాధర రావుపాల్గొని ప్రసంగించారు.

ఆదివాసి అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడిన.. ఇంకా ఆదివాసులు గిరిజన ప్రాంతాల్లో ఉండి ఇంకా వేనుకబాటుతనం ఉందని.. గిరిజనులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.