The Desk…Kaikaluru : కైకలూరు టౌన్ పోలీసులు చొరవ… ఆటపాక గర్ల్స్ హైస్కూల్లో పొదలు తొలగింపు

The Desk…Kaikaluru : కైకలూరు టౌన్ పోలీసులు చొరవ… ఆటపాక గర్ల్స్ హైస్కూల్లో పొదలు తొలగింపు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాలపై కైకలూరు టౌన్ పోలీసులు సామాజిక బాధ్యతతో ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా.. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐలు ఆర్. శ్రీనివాస్, వెంకట కుమార్ లు కలిసి కైకలూరు పట్టణ శివారు ఆటపాక బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో.. హెడ్ మాస్టర్ మరియు విద్యార్థినులు తమ సమస్యలను వివరించారు.

పాఠశాల ప్రాంగణం చుట్టూ పొదలు అధికంగా ఉండడం వల్ల పాములు, ఇతర క్రిములు సంచరించే ప్రమాదం ఉండడంతో భయం నెలకొందని వారు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఉద్యమంలో భాగంగా.. కైకలూరు టౌన్ సీఐ మరియు ఎస్ఐల ఆధ్వర్యంలో ఆదివారం జెసిబి సాయంతో పాఠశాల చుట్టూ ఉన్న పొదలను తొలగించారు. దీంతో పాఠశాల పరిసరాల్లో విష సర్పాలు, ప్రమాదకర క్రిమి కీటకాల భయం తొలగిందన్నారు.

విద్యార్థినులు భయంతో కాకుండా సురక్షిత వాతావరణంలో చదవడానికి అవకాశం కలిగిందని.. పోలీస్ శాఖ శాంతి భద్రతలతోపాటు.. సామాజిక అభివృద్ధికి కృషిచేస్తోందని కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ అన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసులు చూపిన చొరవకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.